మనోజ్ – తేజ ‘మిరాయ్’ పై లేటెస్ట్ అప్‌డేట్

మనోజ్ – తేజ ‘మిరాయ్’ పై లేటెస్ట్ అప్‌డేట్

దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న “మిరాయ్” సినిమాలో తేజ సజ్జతో పాటు హీరో మంచు మనోజ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ముంబైలోని చారిత్రాత్మక గుహలలో ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌లో తేజ సజ్జాతో పాటు, కొంతమంది ప్రధాన పాత్రధారులు కూడా పాల్గొన్నారని తెలుస్తోంది. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 8 వేర్వేరు భాషల్లో 2D, 3D ఫార్మాట్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. కాగా ఈ సినిమా మొత్తం మనోజ్ క్యారెక్టర్ చుట్టే తిరుగుతుందని.. పైగా మనోజ్ పాత్ర చాలా వైల్డ్‌గా ఉంటుందని.. అందుకే ఈ పాత్రను కార్తీక్ ఘట్టమనేని చాలా బలంగా డిజైన్ చేశాడని టాక్. ఆ మధ్య మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఓ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ గ్లింప్స్‌లో సాలిడ్ యాక్షన్ లుక్‌లో.. కత్తి పట్టుకుని “ది బ్లాక్ స్వార్డ్” గా మనోజ్ హైలైట్ అయ్యాడు. అన్నట్టు ఈ సినిమాకి గౌర హరీష్‌ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు సినిమా నిర్మిస్తున్నారు.

editor

Related Articles