హీరోయిన్ రాశీ ఖన్నా తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమెనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో రాశీ ఖన్నా తన ముక్కు నుండి రక్తం కారుతోంది. అలాగే, రాశీ ఖన్నా కాళ్లకు, చేతులకు కూడా దెబ్బలు తగిలి రక్తం కారుతూ ఉంది. ఓ సినిమా షూటింగ్‌లో రిస్కీ యాక్షన్ సీన్స్‌లో రాశీ ఖన్నా పాల్గొంది. అందువల్లే ఆమెకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో ఫర్జీ-2 అనే వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేస్తోంది. అన్నట్టు రీసెంట్‌గా హీరోయిన్ రాశీఖన్నా తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశీ ఖన్నా తన మ్యారేజ్ ప్లాన్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేస్తూ.. ‘నా పెళ్లిపై కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. అవి నిజం కాదు. ఐతే, నాకు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని ఉంది. కానీ నా పెళ్లికి ఇంకా సమయం పడుతుంది. అయినా, నా పెళ్లి అనేది నా పర్సనల్ మ్యాటర్. కాబట్టి ఇక్కడ దాని గురించి డిస్కస్ చేయాలనుకోవడం నాకు ఇష్టం లేదు’ అంటూ రాశీఖన్నా తెలిపింది.
- May 20, 2025
0
72
Less than a minute
Tags:
You can share this post!
editor

