సుమంత్ అనగనగా సినిమాకి ప్రేక్షకులు ఫిదా..

సుమంత్  అనగనగా  సినిమాకి  ప్రేక్షకులు  ఫిదా..

నిజాయితీతో కూడిన స్టోరీ టెల్లింగ్‌, సుమంత్‌ ఇతర సహాయ నటీనటుల మధ్య సాగే భావోద్వేగపూరిత సన్నివేశాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది అనగనగా. ఈ సినిమా అరుదైన మైల్‌స్టోన్‌ను చేరుకుంది. టాలీవుడ్‌ యాక్టర్ సుమంత్  లీడ్ రోల్‌లో నటించిన ఈటీవీ విన్‌ ఒరిజినల్ సినిమా అనగనగా. సన్నీ సంజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుమంత్‌ వ్యాస్ సార్‌గా నటించాడు. అనగనగా  మే 15న ప్రేక్షకుల ముందుకొచ్చిందని తెలిసిందే. ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకి మంచి స్పందన వస్తోంది. అనగనగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ దాటి సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. కొత్తదనంతో కూడిన సినిమాలు చేసే విషయంలో ఎప్పుడూ ముందుండే సుమంత్‌ సరైన కథతో ప్రేక్షకుల ముందుకొచ్చి అందరినీ ఇంప్రెస్ చేస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్‌ చౌదరి హీరోయిన్‌గా నటించగా.. మాస్టర్ విహర్ష్‌, అవసరాల శ్రీనివాస్‌, అనుహాసన్‌, రాకేష్ రాచకొండ ఇతర కీలక పాత్రల్లో నటించారు. చందు రవి సంగీతం అందించాడు.

editor

Related Articles