టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి తమిళ సినిమా టూరిస్ట్ ఫ్యామిలీపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో తాను చూసిన బెస్ట్ సినిమా ఇదేనంటూ కితాబిచ్చాడు. నిన్న అద్భుతమైన టూరిస్ట్ ఫ్యామిలీ అనే సినిమా చూశాను. ఈ సినిమా హృదయాన్ని హత్తుకునేలా ఉంది, కడుపుబ్బ నవ్వించే కామెడీతో పాటు ఎమోషన్‌తో.. ప్రారంభం నుండి చివరివరకు ఆసక్తి కలిగించేలా ఉంది. అభిషన్ జీవింత్ ఈ సినిమాను గొప్పగా రాయడంతో పాటు దర్శకత్వం వహించాడు. ఇటీవల కాలంలో నేను చూసిన బెస్ట్ సినిమా ఇదే. మీరంతా కూడా కచ్చితంగా చూడండంటూ రాజమౌళి రాసుకొచ్చాడు. అయితే రాజమౌళి వ్యాఖ్యలపై తాజాగా టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు అభిషన్ జీవింత్ స్పందిస్తూ.. జక్కన్నకి కృతజ్ఞతలు తెలిపాడు. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను… ఆయన సినిమాలను థియేటర్‌లలో కళ్ళు పెద్దవి చేసుకుని చూసేవాడిని, ఎప్పుడూ ఊహించలేదు ఒకరోజు ఆ ప్రపంచాన్ని సృష్టించిన మనిషి నా పేరు పలుకుతారని. ఎస్ ఎస్ రాజమౌళి సర్. మీరు ఈ కుర్రాడి కలను ఊహకు అందని స్థాయికి తీసుకెళ్లారు. మీ ట్వీట్ చాలా అద్భుతమైన ఆశ్చర్యం కలిగించింది, ఇది నిజంగా మా రోజును మరింత ప్రత్యేకంగా చేసింది. మాటలకు మించి కృతజ్ఞతలంటూ అభిషన్ రాసుకొచ్చాడు.
- May 20, 2025
0
140
Less than a minute
Tags:
You can share this post!
editor

