హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు జ్యోతికృష్ణ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతోంది చిత్రయూనిట్. తాజాగా హీరో పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్. ఎమ్ కీరవాణిని కలిశాడు. స్వయంగా కీరవాణి స్టూడియోకి వెళ్లిన పవన్ కీరవాణితో ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఆస్కార్ అవార్డు ఎక్కడుంది సర్. ఒకసారి చూడాలని పవన్ కళ్యాణ్ కీరవాణిని కోరగా.. కీరవాణి స్పందిస్తూ.. ఆస్కార్‌ను తెచ్చి పవన్ కళ్యాణ్‌కి ఇచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ‘హరిహర వీరమల్లు’ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగం ‘హరిహర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ అంటూ విడుదల కాబోతుంది.
- May 20, 2025
0
69
Less than a minute
Tags:
You can share this post!
editor

