శిల్పా శిరోద్కర్‌కి కరోనా పాజిటివ్

శిల్పా  శిరోద్కర్‌కి  కరోనా  పాజిటివ్

టాలీవుడ్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో SSMB29 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక సమయం దొరికినప్పుడల్లా మహేష్ తన ఫ్యామిలీతో సమయం గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తూ విదేశాలకు వెళ్లి వస్తున్నాడు. అయితే, తాజాగా మహేష్ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా ఆమెకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. బాలీవుడ్‌లో నటిగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఇక శిల్పా శిరోద్కర్‌కు కరోనా రావడంతో ఆమె ఇంటికే పరిమితం అయ్యింది. అందరూ కోవిడ్ నుండి జాగ్రత్తగా ఉండాలని ఆమె ఈ మేరకు సూచించింది. ఫ్యామిలీ పార్టీలు, ఈవెంట్స్‌లో నమ్రతా, శిల్పా తరుచూ కలుసుకుంటుంటారు. ఇలా తమ ఫ్యామిలీ మెంబర్ కరోనా బారిన పడటంతో మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ ఆందోళనలో పడింది.

editor

Related Articles