తమిళ హీరో సూర్య తెలుగులో డైరెక్ట్ సినిమా చేయడానికి చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వెంకీ అట్లూరికి సూర్య ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. కాగా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన పూజా కార్యక్రమంతో ఈ సినిమా అధికారికంగా ప్రారంభించబడింది. ఈ పూజా కార్యక్రమంలో సినిమా టీం హాజరయ్యారు. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అలాగే, రాబోయే రోజుల్లో ఈ సినిమాలోని మిగిలిన ప్రధాన తారాగణం గురించి వివరాలను కూడా మేకర్స్ వెల్లడించనున్నారు. అన్నట్టు ఇప్పటికే, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్, సూర్య సినిమాకు వెంకీతో కలిసి మ్యూజిక్ పనులు కూడా మొదలు పెట్టాడు. ఈ సినిమాకు హీరోయిన్‌గా భాగ్యశ్రీ భోర్సేను తీసుకునే ప్లాన్‌లో ఉన్నారని మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ ప్లేస్‌లోకి గ్లామరస్ బ్యూటీ ‘కాయదు లోహర్’ను తీసుకోబోతున్నారని టాక్ నడిచింది. సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్‌లో దూసుకుపోతుందో చూడాలి.
- May 19, 2025
0
116
Less than a minute
Tags:
You can share this post!
editor

