మెగా 157 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రాబోతుండగా.. గత ఉగాది పండుగ రోజున పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. చిరంజీవి ఈ సినిమాలో తన నిజమైన పేరు శంకర్ వరప్రసాద్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి తాజాగా ఒక అప్డేట్ వైరల్‌గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటించబోతోంది. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకుంది చిత్రబృందం. హలో మాస్టర్ కెమెరా కొంచెం రైట్ టర్న్ ఇచ్చుకోండి. సంక్రాంతికి రఫ్పాడించేద్దాం అంటూ వీడియోను విడుదల చేసింది. ఈ సినిమా షూటింగ్‌ను మే 22 నుండి ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో కొత్త సినిమా సెట్స్‌పైకి రానుంది. అలాగే అనిల్ రావిపూడి ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ హాఫ్ స్క్రిప్ట్‌ను వైజాగ్‌లో రాస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి నయనతారతో పాటు, క్యాథరీన్ థెరిసా నటించనున్నారని సమాచారం. అలాగే, సీనియర్ నటుడు వెంకటేష్ ఈ సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. సంగీత దర్శకుడు భీమ్స్ సెసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
- May 17, 2025
0
158
Less than a minute
Tags:
You can share this post!
editor

