కమెడీయన్‌గా, నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ వీరభక్తుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏదైనా సభలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమంటే గంటల తరబడి మాట్లాడుతుంటాడు. అయితే బండ్ల గణేష్ సినిమాలు తీసి చాలా కాలం అవుతోంది. చాలా గ్యాప్ తరువాత సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో వెరైటీ పాత్రలో కనిపించి మెప్పించాడు. రాజకీయాలకు ఇక దూరం అని బండ్ల గణేష్ ప్రకటించినా మళ్లీ రాజకీయాలతోనే బిజీగా ఉంటున్నాడు. తాజాగా ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిసారు. చంద్రబాబుకి వీరాభిమాని అయిన బండ్ల గణేష్ తాజాగా ఆయనని కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆ సమయంలో బండ్ల గణేష్ ముఖంలో సంతోషంతో పాటు కృతజ్ఞత స్పష్టంగా కనిపిస్తోంది. బండ్ల గణేష్ ఇటీవల మాట్లాడుతూ.. ఏడేళ్లుగా అంతు చిక్కని పరిష్కారం ఒకటి చంద్రబాబు వలన నిమిషాల్లో సమసిపోయిందని.. ఆ పని రెండు రోజుల్లోనే పూర్తయ్యిందని.. అది చంద్రబాబు ఘనత అని ఇటీవల గణేష్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
- May 16, 2025
0
82
Less than a minute
Tags:
You can share this post!
editor


