Movie Muzz

థియేట‌ర్‌లో ఫట్.. ఓటీటీలో హిట్

థియేట‌ర్‌లో ఫట్.. ఓటీటీలో హిట్

కొన్ని సినిమాలు థియేట‌ర్స్‌లో అట్టర్ ఫ్లాప్ అయినా ఓటీటీలో మాత్రం మంచి రెస్సాన్స్ తెచ్చుకుంటాయి. అలాంటి వాటిలో రాబిన్ హుడ్ సినిమా ఒక‌టి. నితిన్ హీరోగా వెంకీ కుడుముల ఈ సినిమాని తెర‌కెక్కించారు. యాక్ష‌న్ ప్యాక్డ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా న‌టించింది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్న‌ర్ ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించి అలరించాడు. భారీ అంచ‌నాల మ‌ధ్య థియేట‌ర్స్‌లోకి వ‌చ్చిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ని పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయింది. మే 10 నుండి ప్ర‌ముఖ ఓటీటీ మాధ్య‌మం జీ5లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేక్ష‌కులు ఉహించ‌లేని గ్రిప్పింగ్ స్టోరీ లైన్‌తో సాగే ఈ సినిమాలో హై ఓల్టేజ్ యాక్ష‌న్ కూడా ఉండ‌డంతో ఓటీటీలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. యాభై మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో ‘రాబిన్‌హుడ్’ దూసుకుపోయింది. థియేటర్లో మాస్ ఆడియెన్స్‌ను మెప్పించిన ‘రాబిన్‌హుడ్’ ప్రస్తుతం ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం అలరిస్తోంది.. గత కొన్ని రోజులుగా ‘రాబిన్‌హుడ్’ జీ5లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతుండ‌గా, 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో ఓటీటీలో సరి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ‘రాబిన్‌హుడ్’ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

editor

Related Articles