Movie Muzz

పాపుల‌ర్ స్పై థ్రిల్ల‌ర్.. ‘స్పెష‌ల్ ఓపీఎస్ 2’ రాబోతోంది

పాపుల‌ర్ స్పై థ్రిల్ల‌ర్.. ‘స్పెష‌ల్ ఓపీఎస్ 2’ రాబోతోంది

ఈ వెబ్‌సీరిస్‌లో న‌టించిన బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు కేకే మీనన్  ఓవ‌ర్‌నైట్ స్టార్ అయిపోయాడు. హిమ్మత్ సింగ్ అనే రా ఏజెంట్ త‌న దేశంపై జ‌రగ‌బోతున్న ఉగ్ర‌దాడుల‌ను ముందే తెలుసుకుని వాటిని ఆపడానికి ఒక స్పెష‌ల్ టీమ్‌ని ఏర్పాటు చేస్తాడు. ఇక ఈ టీమ్ చేసే విన్యాసాలు ఏంటి అనేది వెబ్ సిరీస్ స్టోరీ. అయితే ఇప్ప‌టికే ఫ‌స్ట్ సీజ‌న్‌లో రెండు భాగాలుగా వచ్చి అల‌రించిన ఈ వెబ్ సిరీస్ తాజాగా సెకండ్ సీజ‌న్‌తో అల‌రించ‌బోతోంది. తాజాగా రెండో సీజ‌న్‌కి సంబంధించి మేక‌ర్స్ అనౌన్స్‌మెంట్‌ని పంచుకోగా.. ఇందులో ప్ర‌కాష్‌రాజ్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో కేకే మీనన్‌కి తోడుగా వినయ్ పాఠక్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ప్రకాష్‌రాజ్, తాహిర్ రాజ్ భాసిన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఈ సీజన్‌పై అంచనాలను మరింత పెంచేసింది. హిమ్మత్ సింగ్ తన ప్రత్యేక బృందంతో కలిసి దేశానికి ముప్పు కలిగించే శత్రువులతో తీవ్రంగా పోరాడుతున్నట్లు టీజర్‌లో చూపించారు. భారీ పేలుళ్లు, ఉత్కంఠభరితమైన పోరాట సన్నివేశాలతో ఈ సీజన్ ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. ఈసారి కథాంశం అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ఛేదించే నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.

editor

Related Articles