‘జూనియర్’ సినిమాతో రాబోతున్న గాలి జ‌నార్ధ‌న్ కొడుకు.. జులైలో రిలీజ్

‘జూనియర్’ సినిమాతో రాబోతున్న గాలి జ‌నార్ధ‌న్ కొడుకు.. జులైలో రిలీజ్

గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి పేరు చాలామంది వినే ఉంటారు.. కర్ణాటకలో అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకులలో ఆయన ఒకరు కాగా, ఆయ‌న  కూతురు పెళ్లితో దేశమంతా మాట్లాడుకునేలా చేశారు. వందల కోట్లు పెళ్లి కోసం ఖర్చుపెట్టి హాట్ టాపిక్ అయ్యారు. ఇక కొడుకుని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయాల‌ని భావించి 2022లో ‘జూనియర్ అనే సినిమా మొదలు పెట్టారు. కిరీటీ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమాను సాయి కొర్రపాటి ప్రొడక్షన్ హౌస్‌లో రజని నిర్మిస్తున్నారు. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించ‌గా, జెనీలియా, రవిచంద్ర కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్‌తో పాటు ప్రముఖ టెక్నీషియన్స్ ప‌ని చేస్తున్నారు. ఎప్పుడో మొద‌లైన జూనియ‌ర్ అనే సినిమా ఐదు భాషల్లో జూలై 18న విడుదల చేయబోతున్నట్టు గురువారం మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకి కె. కె. సెంధిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ కాగా, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. తండ్రి జనార్దన్ రెడ్డి ఓ పక్క జైలు జీవితాన్ని గడుపుతుంటే… కొడుకు కిరీటి సినిమా జాతీయ స్థాయిలో విడుదల అవుతుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

editor

Related Articles