గతేడాది బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ హీరో ఆనంద్ దేవరకొండ మరో సినిమాను ప్రారంభించాడు. ‘నైంటీస్’. ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్‌తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్‌తో కలిసి కొత్త సినిమాను ప్రారభించాడు. ఈ సినిమాలో బేబి జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మళ్లీ కలిసి నటించబోతున్నారు. తాజాగా ఈ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్లాప్ కొట్టగా.. నటుడు శివాజీ కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. దర్శకుడు వెంకీ అట్లూరి ఆదిత్య హాసన్‌కి కథను అందించాడు. ప్రొడక్షన్ నెం 32 అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్ట్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్‌లో రానుండగా.. ‘నైంటీస్’. ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ కొనసాగింపుగా ఈ సినిమా రాబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనౌన్స్‌మెంట్ వీడియోను కూడా చిత్ర యూనిట్ వదిలింది. టాలీవుడ్ నటుడు శివాజీ, వాసంతిక కీలక పాత్రలో నటిస్తున్నారు. నాగవంశీ ఈ సినిమాను నిర్మించబోతున్నారు.
- May 15, 2025
0
136
Less than a minute
Tags:
You can share this post!
editor

