రామ్ గ్లింప్స్ అదిరిపోలా.. ఆంధ్ర కింగ్ అంటూ ర‌చ్చ..!

రామ్ గ్లింప్స్ అదిరిపోలా.. ఆంధ్ర కింగ్  అంటూ ర‌చ్చ..!

టాలీవుడ్ హీరో రామ్ వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కులని అలరించేందుకు ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తున్నారు. కాని సరైన స‌క్సెస్ ప‌డ‌డం లేదు. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా త‌ర్వాత రామ్ మంచి హిట్ కొట్టింది లేదు. ఇప్పుడు ప్రేమ క‌థ‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు రామ్. మాస్ మంత్రం జ‌పిస్తూ గుబురు గ‌డ్డంతో ర‌చ్చ చేసిన దానికి స‌రైన ఆద‌ర‌ణ ద‌క్క‌లేదు. ఇప్పుడు స్లిమ్ అండ్ క్లీన్ లుక్‌లో అమ్మాయిల మనసు దోచే విధంగా హ్యాండ్స‌మ్ లుక్‌లో క‌నిపించ‌నున్నాడు రామ్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ‘RAPO22గా ఈ సినిమా రూపొందుతోంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేం పి.మహేష్ బాబు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా.. రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ రోజు రామ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా గ్లింప్స్‌తో పాటు టైటిల్ రివీల్ చేశారు మేక‌ర్స్. గ్లింప్స్‌లో సినిమా థియేటర్ లో.. టికెట్ల కోసం పలుకు బడిని వాడటం.. ఎమ్మెల్యే, పోలీస్ తాలుకా అంటూ టిక్కెట్స్ అడ్వాన్స్ బుకింగ్ తీసుకోడం.. త‌ర్వాత ఆంధ్రా కింగ్ సూర్య సినిమా అంటే మామూలు విషయమా? అని చెప్పడం.. మన హీరో ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్ అని చెప్పి.. ఆంధ్ర కింగ్ తాలుకా అని యాభై టికెట్లు తీసుకోవడవం వంటివి చూస్తుంటే నిజంగానే ఇదొక ఫ్యాన్ బయోపిక్ మాదిరిగానే అనిపిస్తోంది.

editor

Related Articles