DC కామిక్స్ నుండి వచ్చిన పాపులర్ సూపర్ హీరో పాత్రలలో సూపర్ మ్యాన్ ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుండి ఇప్పటికే ఐదుకి పైగా సినిమాలు విడుదల కాగా.. తాజాగా మరో సినిమా రాబోతోంది. జేమ్స్ గన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు క్లార్క్ కెంట్ సూపర్‌మ్యాన్‌గా నటిస్తుండగా, లోయిస్ లేన్‌గా రాచెల్ బ్రోస్నాహన్, లెక్స్ లూథర్‌గా నికోలస్ హౌల్ట్ కనిపించనున్నారు. ఈ సినిమా యునైటెడ్ స్టేట్స్‌లో జూలై 11 విడుదల కానుండగా.. అంతర్జాతీయంగా జూలై 9 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఇది ఆశలు రేకెత్తించే, మనుషుల మీద నమ్మకం కలిగించే మంచి కథలా అనిపిస్తోంది. క్లార్క్ కెంట్, సూపర్‌మ్యాన్ పాత్రలో డేవిడ్ కోరెన్స్వెట్ బాగా సూటవుతున్నాడు. లోయిస్ లేన్‌గా రాచెల్ బ్రోస్నాహన్ చాలా తెలివైన అమ్మాయిలా ఉంది. ఇక లెక్స్ లూథర్‌గా నికోలస్ హౌల్ట్ భయానకమైన విలన్‌లా కనిపించబోతున్నాడు. ట్రైలర్‌లో యాక్షన్ సీన్లు, విజువల్స్ చాలా బాగున్నాయి.
- May 15, 2025
0
185
Less than a minute
Tags:
You can share this post!
editor

