భాగ్యనగరిలో ‘ఓజీ’ షూటింగ్ మొదలైంది

భాగ్యనగరిలో ‘ఓజీ’ షూటింగ్ మొదలైంది

రాజకీయాలకు  బ్రేక్‌నిచ్చి ఇక వరుసగా తన సినిమాలను పూర్తి చేసే కార్యక్రమంలో పడ్డారు హీరో పవన్‌కళ్యాణ్‌. ఇటీవలే ఆయన ‘ఓజీ’ షూటింగ్‌లో జాయిన్‌ అయిన విషయం తెలిసిందే. ‘మళ్లీ మొదలైంది.. ఈసారి ముగిద్దాం’ అంటూ చిత్ర బృందం సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌తో అభిమానులు ఖుషీ. సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ డ్రామా ఇది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. పవన్‌కళ్యాణ్‌ ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లో పాల్గొంటున్నారని, ఇది సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని చిత్రబృందం చెబుతోంది. సాధ్యమైనంత తొందరలో ఈ సినిమాను పూర్తిచేయాలనే ఆలోచనలో పవన్‌కళ్యాణ్‌ ఉన్నట్లు సమాచారం. ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ విలన్ పాత్రను పోషిస్తున్నారు.

editor

Related Articles