ఆప‌రేష‌న్ సింధూర్.. చట్టాలు కఠినంగా ఉండాలి.. ర‌ష్మీ

ఆప‌రేష‌న్ సింధూర్.. చట్టాలు కఠినంగా ఉండాలి.. ర‌ష్మీ

యాంక‌ర్ ర‌ష్మీ గురించి తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమె యాంక‌ర్‌గా క‌న్నా కూడా స‌మాజంపై ఎక్కువ‌గా బాధ్య‌త చూపిస్తూ అందరి మ‌న్న‌న‌లు పొందుతోంది. ఈ మ‌ధ్య ఆప‌రేష‌న్ సింధూర్ గురించి త‌ర‌చు ప్ర‌స్తావిస్తోంది. కొద్దిరోజుల క్రితం ర‌ష్మీ త‌న సోష‌ల్ మీడియా పేజ్‌లో భారత్-పాకిస్తాన్ యుద్ధంపై హాట్ కామెంట్స్ చేస్తూ.. మనం శాంతి అనే కలల్లోనే బ్రతుకుతున్నట్లు ఉన్నామని.. అదే మనకు ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చిందని పేర్కొంది. ఇక తాజాగా ఆపరేషన్ సింధూర్‌పై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. యుద్ధ సమయంలో శత్రువును కీర్తించడం.. సొంత నాయకుడిని విమర్శించడం.. అభిప్రాయం కాదు రాజద్రోహం అంటూ ర‌ష్మీ త‌న పోస్ట్‌లో పేర్కొంది. సెన్సిటివ్ విష‌యాల గురించి కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దానిని మ‌నం అర్ధం చేసుకోవాలి. ఏ మాత్రం ఆలోచించ‌కుండా మన దేశ నాయకులను విమర్శించడం కరెక్ట్ కాదు అంటూ ర‌ష్మీ పేర్కొంది. ఈ సారి తన బ‌ర్త్ డేని బాలీలో జ‌రుపుకుంది. వీల్ చైర్‌లో కూర్చొనే అంద‌మైన ప్ర‌దేశాల‌ని చూస్తూ ఎంజాయ్ చేసింది ర‌ష్మి.

editor

Related Articles