సినీ పితామ‌హుడి పాత్ర‌లో ఎన్టీఆర్.. ద‌ర్శ‌కుడు ఎవ‌రో..!

సినీ పితామ‌హుడి పాత్ర‌లో ఎన్టీఆర్.. ద‌ర్శ‌కుడు ఎవ‌రో..!

జూనియ‌ర్ ఎన్టీఆర్ సినీ పితామ‌హుడి బ‌యోపిక్ చేయ‌బోతున్న‌ట్టు జోరుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. సినీ పితామహుడిగా పరిశ్రమ కొనియాడే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌లో నటించేందుకు తారక్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం న‌డుస్తోంది. ఈ సినిమా వెనుక రాజమౌళి, కార్తికేయ, వరుణ్ గుప్తా (మ్యాక్స్ స్టూడియోస్) ప్రమేయం ఉందని టాక్. ఇప్ప‌టికే  స్క్రిప్ట్ సిద్ధం కాగా, అది విన్న జూనియ‌ర్ ఎన్టీఆర్ చాలా ఎగ్జైట్ అయి ఈ ప్రాజెక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. భారతీయ చలన చిత్ర పరిశ్రమ ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ రెండేళ్ల కిందట ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ అనే సినిమా అనౌన్స్ చేయ‌గా, ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో నితిన్‌ కక్కర్ సినిమాని తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టు తెలియ‌జేశారు. దీనికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని అప్పుడు చెప్ప‌గా, కాని ఆ త‌ర్వాత దాని గురించి నోరు విప్పింది లేదు. కాని ఇప్పుడు ఉన్నట్టుండి ఇందులో ఎన్టీఆర్ నటిస్తారని బాంబే మీడియాలో తెగ వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. దాదాసాహెబ్ ఫాల్కే జీవితం చాలా పెద్దది. అలాంటి కంటెంట్ క‌చ్చితంగా ఇప్పటి తరానికి పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. జూనియర్ ఎన్టీఆర్ లాంటి న‌టుడు ఈ సినిమా చేస్తే ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

editor

Related Articles