నటిగా తన సత్తా చాటిన సమంత నిర్మాతగాను తొలి విజయం దక్కించుకుంది. సమంత నిర్మించిన శుభం సినిమా ఇటీవల విడుదలై అందరి ప్రశంసలు అందుకుంటోంది. గత కొంతకాలంగా సమంత వైవాహిక జీవితం గురించి నెట్టింట అనేక వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం సమంత ఇటీవల రాజ్ నిడిమోరుతో ఎక్కువగా కనిపిస్తోంది. ఎక్కడికి వెళ్లినా సమంత పక్కన రాజ్ ఉంటున్నాడు. త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోవడం ఖాయమని కొందరు జోస్యాలు చెబుతున్నారు. రాజ్ నిడిమోరుకు ఇప్పటికే పెళ్లి కాగా.. ఆ కారణంగా సమంతతో పెళ్లి ఆలస్యమైందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. రాజ్ నిడిమోరు తెలుగు వ్యక్తి కాగా, ఆయన ఇటీవల సమంతతో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ తీశాడు. ఇక శుభం సినిమా కోసం సామ్‌తో కలిసి పని చేసినట్టు తెలుస్తోంది. ఇక తాజాగా సమంత తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఇందులో రాజ్‌పై సమంత వాలినట్టుగా కనిపిస్తుంది. దీంతో వారి బాండింగ్ రోజు రోజుకీ బలపడుతోందిగా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. సమంత నిర్మించిన శుభం సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.5 కోట్ల 25 లక్షల గ్రాస్ రాబట్టిన నేపథ్యంలో సమంత సోషల్ మీడియాలో తన సంతోషం వ్యక్తం చేసింది.
- May 15, 2025
0
268
Less than a minute
Tags:
You can share this post!
editor

