త్రివిక్రమ్ దర్శకత్వంలో అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ.. సినిమాల్లో హీరోయిన్గా నటించారు సమంత. ఈ మూడూ బ్లాక్‌బస్టర్ హట్సే. అయితే.. ‘అఆ’ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో సమంత నటించలేదు. తాజా సమాచారం ప్రకారం మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రానున్నదని తెలుస్తోంది. ఇటీవల ఓ సందర్భంలో సమంత తెలుగు సినిమాల్లో నటించాలని త్రివిక్రమ్‌ను కోరారు. సామ్ కూడా తన ‘శుభం’ ప్రమోషన్లో భాగంగా తెలుగు సినిమాల్లో నటించాలనుందనీ, అయితే.. సరైన కథలు రావడం లేదని, మంచి లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ వస్తే చేస్తానని చెప్పుకొచ్చింది. అందుకే.. సామ్ కోసం గురూజీ మళ్లీ కలం పట్టారట. ప్రస్తుతం ఆయన వెంకటేష్‌తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. వెంకటేష్ కాల్షీట్లు ఖరారైతే.. ఈ సినిమా పట్టాలెక్కుతుంది. అయితే.. ఈ లోపు సామ్ కోసం గురూజీ ఓ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌ను తయారు చేసే పనిలో ఉన్నారట. వెంకీ సినిమాతో పాటు సమంత సినిమాను కూడా పూర్తి చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారని ఫిల్మ్ వర్గాల సమాచారం.
- May 14, 2025
0
180
Less than a minute
Tags:
You can share this post!
editor

