హీరో అల్లు అర్జున్ మార్కెట్ ఇపుడు ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప 2 తో పాన్ ఇండియా లెవెల్లో కొత్త లెక్కలు చూపించిన బన్నీ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ సినిమాతో రచ్చ చేయబోతున్నాడు. ఇక తన లైనప్‌లో పలు సాలిడ్ ప్రాజెక్ట్‌లు ఆల్‌రెడీ లైన్‌లో ఉండగా ఇపుడు మహాభారతం కూడా వచ్చినట్టుగా కొన్ని రూమర్స్ వైరల్‌గా మారాయి. ఇది మన టాలీవుడ్ నుండి ఎస్ ఎస్ రాజమౌళి మహాభారతం కాదట బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్‌ఖాన్ డ్రీం ప్రాజెక్ట్ మహాభారతం కోసం అన్నట్టు బజ్ వినిపిస్తోంది. అయితే లేటెస్ట్ రూమర్స్ ప్రకారం ఇందులో అల్లు అర్జున్ పవర్‌ఫుల్ రోల్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం, బన్నీ తన పేరు అర్జునుడి పాత్రనే ఈ మహాభారతంలో పోషించనున్నాడు అని ఇపుడు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో కానీ ఉంటే మాత్రం తన నుండి మరో గుర్తుండిపోయే పాత్రగా అది నిలిచిపోవచ్చని చెప్పాలి.
- May 14, 2025
0
297
Less than a minute
Tags:
You can share this post!
editor

