విరాట్‌ కోసమే క్రికెట్‌ మ్యాచ్ చూశా..! ప్రీతి జింటా..

విరాట్‌ కోసమే క్రికెట్‌ మ్యాచ్ చూశా..! ప్రీతి జింటా..

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. విక్కీ కౌశల్‌, అనిల్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌ పలువురు బాలీవుడ్‌ నటులు రిటైర్మెంట్‌పై స్పందించారు. తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఓనర్‌ ప్రీతి జింటా సైతం విరాట్‌ రిటైర్మెంట్‌పై తన అభిప్రాయం వెల్లడించింది. తాను విరాట్‌ కోసమే టెస్ట్‌ క్రికెట్‌ చూశానని ప్రీతి తెలిపింది. ఆటపై విరాట్‌కు ఉన్న మక్కువను ప్రశంసించింది. టెస్ట్‌ క్రికెట్‌ ఇక ఎప్పటికీ ఒకేలా ఉండదంటూ సోషల్‌ మీడియా వేదికగా స్పందించింది. సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’లో ఓ యూజర్‌ మేడమ్‌ విరాట్‌ కోహ్లీ టెస్ట్‌ క్రికెట్‌ నుండి రిటైర్‌ అయ్యారని విన్నప్పుడు మీ స్పందన ఏంటీ? అని ప్రశ్నించారు. దానికి ప్రీతి జింటా స్పందిస్తూ.. ‘నేను విరాట్‌ కోసమే టెస్ట్‌ క్రికెట్‌ను చూశాను. అతను ఆటను అభిరుచితో నింపాడు. టెస్ట్ క్రికెట్ మళ్లీ ఎప్పటికీ ఒకేలా ఉంటుందని నేను అనుకోను. భవిష్యత్తు కోసం అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

editor

Related Articles