ప్రతిష్టాత్మక 78వ కేన్స్ ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. మే 24 వరకు ఈ వేడుక జరగనుండగా, ఈ వేడుకలో అందాల తారలు సందడి చేశారు. భారతీయ సినీ ప్రముఖులు ఐశ్వర్యరాయ్, ఊర్వశీ రౌతేలా, జాన్వీకపూర్, ఇషాన్ కట్టర్, కరణ్ జోహార్ తదితరులు వేడుకలో సందడి చేశారు. ఈ వేడుకకి ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ దర్శకురాలు పాయల్ కపాడియా జ్యూరీ మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు. అలియాభట్ కూడా వేడుకకి హాజరు కావల్సి ఉండగా, భారత్ -పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో వచ్చిన తొలి అవకాశాన్ని మిస్ చేసుకుంది. ఫ్యాషన్‌లో ట్రెండ్ సెట్ చేస్తూ హాట్ లుక్స్‌తో అదరగొట్టే బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతేలా సెన్సేషన్‌గా మారింది. కేన్స్ నగరంలో జరుగుతున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో తళుక్కున మెరిసి అదరగొట్టింది. కొంతకాలంగా కేన్స్‌లో మెరుస్తూ సందడి చేసిన ఈమె తాజాగా రంగు రంగుల ధస్తులు ధరించి చిలుక ఆకారంలో ఉన్న క్రిస్టల్ ఎంబెడెడ్ క్లచ్‌ని పట్టుకొని వచ్చింది. ఆమె పట్టుకున్న చిలుక బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈమె 2025లో వచ్చిన డాకు మహరాజ్ సినిమా బాలయ్యతో చిందులేసి తెలుగు ప్రేక్షకులని అలరించింది.
- May 14, 2025
0
141
Less than a minute
Tags:
You can share this post!
editor

