అన‌న్య ఫ్యాష‌న్ డిజైన‌ర్స్‌కి బంపర్ ఆఫ‌ర్..!

అన‌న్య ఫ్యాష‌న్ డిజైన‌ర్స్‌కి బంపర్ ఆఫ‌ర్..!

వకీల్ సాబ్ సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది అనన్య. ప్ర‌తి సినిమాతో త‌న మార్క్ సెట్ చేస్తున్న అన‌న్య నాగ‌ళ్ల సిల్వర్ స్క్రీన్ మీద నటిగా పేరు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో ఫొటో షూట్లతో మెప్పిస్తుంటుంది. ఉన్నత చదువులు అభ్యసించి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ హీరోయిన్ సినిమాల‌పై మ‌క్కువతో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చింది. అయితే మొద‌ట షార్ట్ ఫిల్మ్స్ చేసి ఆ త‌ర్వాత హీరోయిన్‌గా మారింది. అనన్య నాగళ్ల ప్లే బ్యాక్, మ్యాస్ట్రో, ఊర్వశివో రాక్షసివో, శాకుంతలం, తంత్ర, డార్లింగ్, పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తదితర సినిమాల్లో హీరోయిన్‌గా, సెకెండ్ ఫిమేల్ లీడ్ రోల్స్ న‌టించి ప్రేక్ష‌కుల‌ని మెప్పించింది. ఈ హీరోయిన్ తాజాగా ఇన్ స్టా స్టోరీస్‌లో ఒక పోస్ట్ షేర్ చేసింది. ‘ఫ్యాషన్ డిజైనర్ కోసం వెతుకుతున్నాను. 0-6 సంవత్సరాల అనుభవం ఉన్న‌వారు ఎవ‌రైన స‌రే.. దయచేసి మీ రెజ్యూమ్‌ను పంపండి. దయచేసి DM చేయవద్దు’ అని అందులో పేర్కొంది. మొత్తానికి అన‌న్య ఫ్యాష‌న్ డిజైన‌ర్స్‌కి బంపర్ ఆఫ‌ర్ ఇచ్చింది. ఈ అవ‌కాశాన్ని మిస్ చేసుకోకండి మరి.

editor

Related Articles