సుమ ప‌ది రోజులు మౌన వ్రతం.. ఎందుకో మరి..!

సుమ ప‌ది రోజులు మౌన వ్రతం.. ఎందుకో మరి..!

యాంక‌ర్ సుమ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కొన్ని ద‌శాబ్ధాలుగా త‌న యాంక‌రింగ్‌తో అల‌రిస్తూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలో ఆమెకి హీరోయిన్స్‌ని మించి క్రేజ్ ఏర్ప‌డింది. బుల్లితెరపై తిరుగులేని యాంక‌ర్‌గా రాణిస్తున్న‌ సుమ కనకాల తనదైన యాంకరింగ్‌తో ఎన్నో టీవీషోలను విజయవంతంగా నడిపిస్తోంది. మాతృబాష తెలుగు కాకపోయినప్పటికీ తెలుగులో చాలా చ‌క్క‌గా మాట్లాడుతుంది. ఎలాంటి ఈవెంట్ అయినా సింగిల్ హ్యాండ్‌తో డీల్ చేసే స‌త్తా సుమ సొంతం. సుమ కెరీర్ బినింగ్‌లో పలు సీరియల్స్‌లో నటించారు. వేయిపడగలు అనే సీరియల్‌తో పరిచయం అయిన సుమ అందులో లీడ్ రోల్ చేసింది. ఆతర్వాత మేఘమాల సీరియల్‌లో నటిస్తున్న సమయంలోనే రాజీవ్ కనకాలతో ప్రేమలో పడి అత‌నిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం యాంకర్ సుమ టీవీ షోలు, సినిమా ఈవెంట్స్, తన యూట్యూబ్ ఛానల్‌తో బిజీగా గ‌డిపేస్తుంది. త‌న యూట్యూబ్ ఛానెల్‌లో చాట్ షో అనే ఇంట‌ర్వ్యూ ప్రోగ్రాం చేస్తుండ‌గా, ఇందులో త‌న వాయిస్ స‌మ‌స్య గురించి చెప్పుకొచ్చింది. గ‌తంలో నాకు వోకల్ నాడ్యూల్స్ వచ్చినపుడు డాక్టర్స్ నా వాయిస్‌కి రెస్ట్ ఇవ్వమని చెప్పారు. చేసేదేం లేక పది రోజులు నేను మౌన వ్రతం చేశాను. నా వోకల్ కార్డ్స్‌లో స్మాల్ బంప్స్ లాంటివి రావ‌డంతో డాక్టర్ అస్సలు మాట్లాడొద్దు అన్నారు. దాంతో పది రోజులు మాట్లాడకుండా ఉన్నాన‌ని చెప్పుకొచ్చింది.

editor

Related Articles