హీరో పవన్ కళ్యాణ్ చేస్తున్న అన్ని సినిమాల్లో కూడా భారీ హైప్ ఉన్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది “ఓజి” సినిమానే అని చెప్పాలి. దర్శకుడు సుజీత్‌తో చేస్తున్న ఈ సినిమాకి ఎనలేని హైప్ అనౌన్స్ చేసిన రోజు నుండీ నెలకొంది. సోషల్ మీడియాలో కూడా మేకర్స్ నుండి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా కూడా అది సెన్సేషన్ గానే మారుతోంది. మరి ఇలా చాలాకాలం తర్వాత మేకర్స్ షూటింగ్‌ని పునః ప్రారంభం చేయగా ఇపుడు ఫైనల్‌గా ఆంధీ సెట్స్‌లో అడుగు పెట్టేందుకు సమయం ఆసన్నం అయినట్టుగా తెలుస్తోంది. రేపు మే 14 నుండి హైదరాబాద్‌లో పవర్ స్టార్ సెట్స్‌లో అడుగు పెట్టనున్నట్టుగా తెలుస్తోంది. ఇలా తన పోర్షన్ షూటింగ్ మొత్తాన్ని ఈ జూన్ 10 నాటికి కంప్లీట్ చేసేయాలని షెడ్యూల్ ప్లానింగ్ అట. మొత్తానికి మాత్రం పవర్ తుఫాన్ మళ్ళీ సెట్స్‌లోకి రాబోతుండడం ఇపుడు పవన్ అభిమానులను ఎగ్జైట్ చేస్తోంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.
- May 13, 2025
0
163
Less than a minute
Tags:
You can share this post!
editor

