గృహప్రవేశం చేసుకుని కొత్తింట్లోకి అడుగుపెట్టిన అన‌సూయ‌..

గృహప్రవేశం చేసుకుని కొత్తింట్లోకి అడుగుపెట్టిన అన‌సూయ‌..

అన‌సూయ ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి సినిమాల‌తో న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనసూయ వెబ్ సిరీస్‌లలోనూ బిజీ అవుతోంది. అలాగే అనసూయ మరికొన్ని ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. నటిగా మాత్రమే కాకుండా యాంకర్, మోడల్, వెబ్ సిరీస్ ఆర్టిస్ట్ ఇలా విభిన్న వేదికల్లో తనదైన ముద్ర వేసుకుంటూ వెళ్తోంది. సినిమాల‌తో, టీవీ షోస్‌తో బిజీగా ఉంటున్న అన‌సూయ రెండు చేతులా సంపాదిస్తోంది. ఈ క్ర‌మంలో హైదరాబాద్‌లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది. సోమవారం తన ఫ్యామిలీతో కలిసి కొత్తింటిలోకి అడుగుపెట్ట‌గా, ఆ ఇంటికి ‘శ్రీరామ సంజీవని’ అనే పేరు పెట్టింది. ఈ విషయాన్ని అనసూయ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.. గృహ ప్రవేశానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. అన‌సూయ ఫ్యామిలీ పిక్స్, ఇంటి పిక్స్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ‘ఆ సీతారామాంజనేయ కృపతో.. మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో.. మీ అందరి ప్రేమతో.. మా జీవితంలోని మరో అధ్యాయం.. శ్రీరామ సంజీవని.. మా కొత్తింటి పేరు.. జై శ్రీరామ్.. జై హనుమాన్ అంటూ అన‌సూయ పోస్ట్ పెట్టింది. అన‌సూయ షేర్ చేసిన పోస్ట్‌లో.. అనసూయ, సుశాంక్ భరద్వాజ్ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించి, నూతన గృహంలోకి అడుగు పెట్టినట్లు కనిపిస్తోంది.

editor

Related Articles