ప్రెగ్నెన్సీపై నెట్టింట జోరుగా ప్ర‌చారాలు.. క్లారిటీ ఇచ్చిన శోభిత

ప్రెగ్నెన్సీపై నెట్టింట జోరుగా ప్ర‌చారాలు.. క్లారిటీ ఇచ్చిన శోభిత

ఇటీవ‌ల చాలామంది సెల‌బ్రిటీలు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక వారు పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్న‌ట్టు నెట్టింట తెగ ప్ర‌చారాలు సాగుతున్నాయి. శోభితా ధూళిపాళ్ల‌ ప్రెగ్నెంట్ అంటూ కొన్ని వార్త‌లు రాగా  శోభిత కూడా ప్రెగ్నెంట్ అంటూ ప్ర‌చారాలు సాగుతున్న స‌మ‌యంలో శోభిత క్లారిటీ ఇచ్చింది. ఇటీవ‌ల ముంబైలో జరిగిన WAVES -2025 సమ్మిట్లో శోభిత ధూళిపాళ్ల‌ వదులుగా ఉండే చీర కట్టుకొని క‌నిపించ‌డంతో ప్రెగ్నెన్సీ రూమ‌ర్స్ ఎక్కువ‌య్యాయి. ఈ క్ర‌మంలో శోభిత ప్రెగ్నెన్సీపై ఆమె టీమ్ స్పందించింది. ‘గుడ్‌ న్యూస్‌’ కాదు, ఒట్టి పుకారు మాత్రమే. దీంతో గ‌త కొద్ది రోజులుగా వ‌స్తున్న వార్త‌ల‌కు ఫుల్ స్టాప్ ప‌డింది. గతేడాది డిసెంబర్‌లో నాగ చైతన్య, శోభితల వివాహం జరిగింది. పెళ్లి తర్వాత శోభిత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. సోషల్‌ మీడియా ద్వారా మాత్రం తెగ సంద‌డి చేస్తోంది. పెళ్లి త‌ర్వాత కూడా శోభిత గ్లామ‌ర్ లుక్స్ షేర్ చేస్తూనే ఉంది. ఒక్కోసారి కేక పుట్టించే అందాలు చూపిస్తూ మైమ‌రిపింప‌జేస్తుంది. ఇక నాగ చైత‌న్య విష‌యానికి వ‌స్తే.. శోభిత‌ని వివాహం చేసుకున్న త‌ర్వాత ఆయ‌న కెరీర్‌లో తండేల్ రూపంలో పెద్ద హిట్ ద‌క్కింది. శోభిత వచ్చిన వేళా విశేషం అని ఇక నుండి చైతూకి అంతా మంచే జ‌రుగుతుంద‌ని కొంద‌రు నెటిజ‌న్స్ కామెంట్ చేశారు.

editor

Related Articles