రూ.160 కోట్ల క్ల‌బ్‌లో మోహ‌న్ లాల్ ‘తుడ‌రుమ్‌’..

రూ.160 కోట్ల క్ల‌బ్‌లో మోహ‌న్ లాల్ ‘తుడ‌రుమ్‌’..

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన తాజా సినిమా ‘తుడరుమ్’ బాక్సాఫీస్ వద్ద సంచల‌నాలు సృష్టిస్తోంది. విడుద‌లైన మొద‌టిరోజు నుండే హౌజ్‌ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతున్న ఈ సినిమా తాజాగా 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 160 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. కేవ‌లం ఇండియాలోనే రూ. 75 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా మలయాళ భాషలో విడుదలైన వెర్షన్‌కు ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందన లభిస్తోంది. మార్చి 27న‌ ఎంపురాన్ అంటూ వ‌చ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న మోహ‌న్ లాల్ ఈ సినిమా త‌ర్వాత నెల రోజులు కూడా గ్యాప్ తీసుకోకుండానే తుడ‌రుమ్‌ని విడుద‌ల చేశాడు. ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఫ‌స్ట్ షో నుండే పాజిటివ్ టాక్ రావ‌డంతో జ‌నాలు థియేట‌ర్ల‌కి క్యూ క‌డుతున్నారు. దీంతో ఎల్‌2 ఎంపురాన్ తర్వాత తుడ‌రుమ్ సినిమా మోహన్‌లాల్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిందని ప్రేక్ష‌కులు చెబుతున్నారు. ‘తుడరుమ్’ సినిమాకి థరుణ్ మూర్తి దర్శకత్వం వహించ‌గా.. ఈ సినిమాలో మోహన్‌లాల్ సరసన శోభన న‌టించింది. ప్రకాష్ వర్మ, బిను పప్పు వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు.

editor

Related Articles