స్టేజ్‌పై హుషారుగా స్టెప్పులేసిన స‌మంత‌..

స్టేజ్‌పై హుషారుగా స్టెప్పులేసిన స‌మంత‌..

 టాలీవుడ్ హీరోయిన్ స‌మంత ఇప్పుడు న‌టిగా, నిర్మాత‌గా ఇండ‌స్ట్రీలో రాణించే ప్ర‌య‌త్నం చేస్తోంది. న‌టిగా మంచి మార్కులు కొట్టేసిన స‌మంత ఇప్పుడు నిర్మాత‌గా కూడా అదృష్టం ప‌రీక్షించుకోబోతోంది. ఆమె తాజాగా శుభం అనే సినిమా అతిథి పాత్ర పోషించి, ఈ సినిమాని నిర్మిస్తోంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మే 9న ఈ హర్రర్ కామెడీ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అయితే తన హోమ్ బ్యానర్ నుండి రాబోతున్న ఫస్ట్ సినిమా కావడంతో సమంత కూడా చాలా యాక్టివ్‌గా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటోంది. ఆదివారం సాయంత్రం ‘శుభం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను వైజాగ్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. సమంతతో సహా నటీనటులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ సందర్భంగా సామ్ మాట్లాడుతూ.. వైజాగ్‌లో ఈవెంట్స్ జరుపుకున్న తన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయని , ఇది కూడా విజ‌యం సాధిస్తుంద‌నే ఆశాభావం వ్య‌క్తం చేసింది. సినిమా చూశాక అంద‌రు కూడా చిరున‌వ్వుతోనే బ‌య‌ట‌కు వ‌స్తార‌ని పేర్కొంది.

editor

Related Articles