‘జైలర్‌-2’లోకి  ప్రవేశిస్తున్న  బాలకృష్ణ?

‘జైలర్‌-2’లోకి  ప్రవేశిస్తున్న  బాలకృష్ణ?

హీరోలు రజనీకాంత్‌, బాలకృష్ణ సిల్వర్‌ స్క్రీన్‌పై తమ పవర్‌ప్యాక్డ్‌ పెర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టబోతున్నారా? ఇప్పుడీ వార్త దక్షిణాదిలో హాట్‌టాపిక్‌గా మారింది. రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌’ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలవడంతో సీక్వెల్‌గా రాబోతున్న ‘జైలర్‌-2’పై భారీ అంచనాలేర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఇందులో ఓ కీలకమైన అతిథి పాత్ర కోసం చిత్రబృందం బాలకృష్ణను సంప్రదించిందట. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారని తమిళ సినీవర్గాల్లో వినిపిస్తోంది. తొలిభాగం ‘జైలర్‌’లో శివరాజ్‌కుమార్‌, మోహన్‌లాల్‌ వంటి పెద్దనటులు కీలకమైన అతిథి పాత్రల్లో కనిపించారు. ఇప్పుడు సీక్వెల్‌లో బాలకృష్ణ అదేతరహా పాత్రలో కనిపిస్తారని టాక్‌. ఈ సినిమాలో బాలకృష్ణ నటిస్తే బాగుంటుందని సినిమా దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ ఓ సందర్భంలో చెప్పారు. తాజాగా ఆయన బాలకృష్ణ కోసం ఓ పవర్‌ఫుల్‌ పాత్రను క్రియేట్‌ చేశారని అంటున్నారు. కేవలం అతిథి పాత్ర తరహాలో కాకుండా కథాగమనంలో కీలకంగా ఉంటూ పది నిమిషాల నిడివితో బాలకృష్ణ పాత్రను డిజైన్‌ చేశారని తెలిసింది. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే సినిమా బృందం నుండి అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే. ఒకవేళ ఇదేగనుక నిజమైతే రజనీకాంత్‌ – బాలకృష్ణ కాంబోతో థియేటర్లు కలెక్షన్లు పెరగడానికి దోహదపడుతుంది.

editor

Related Articles