సింహాచలం దుర్ఘటన తెలిసి దిగ్భ్రాంతికి లోనైన ప‌వ‌న్ క‌ళ్యాణ్

సింహాచలం దుర్ఘటన తెలిసి దిగ్భ్రాంతికి లోనైన ప‌వ‌న్ క‌ళ్యాణ్

విశాఖ జిల్లా సింహాచలం అప్పన్నస్వామి ఆలయం వద్ద అపశ్రుతి చోటు చేసుకుంది. దర్శనానికి బారులు తీరిన భక్తులపై గోడ కూలి ఇప్పటివరకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఎస్టీఆర్‌ఎఫ్ బృందాలు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఇప్ప‌టికే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేయ‌గా.. తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదిక‌గా స్పందించాడు. చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ అన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. విశాఖపట్నం జిల్లా అధికారుల నుండి ఈ ఘటన వివరాలు తెలుసుకున్నాను. భారీవర్షాల మూలంగా గోడ కూలిందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించాను అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాసుకొచ్చాడు.

editor

Related Articles