‘బలగం’ సినిమాతో విమర్శకుల ప్రశంసలందుకున్న దర్శకుడు వేణు యెల్దండి. వేణు తదుపరి సినిమాగా ‘ఎల్లమ్మ’ సినిమా రాబోతుండగా.. ఈ సినిమాలో హీరోగా నితిన్ నటిస్తున్నాడు. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత. తెలంగాణ నేపథ్యంలో గ్రామదేవతల చుట్టూ తిరిగే సోషల్ డ్రామా ఇదని సమాచారం. అయితే ఈ సినిమాకు ఇప్పటివరకు హీరోయిన్ ఓకే అవ్వలేదు. మొదట ఈ సినిమాలో సాయిపల్లవిని ఎల్లమ్మ కోసం అనుకున్నారు. సాయి పల్లవి కూడా కథలోని కొత్తదనం, భావోద్వేగాలు నచ్చడంతో వెంటనే ఓకే కూడా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే అనుకోని కారణాల వలన సాయి పల్లవి మధ్యలోనే తప్పుకుంది. అనంతరం కీర్తి సురేష్‌ని ఎల్లమ్మ కోసం సంప్రదించగా.. పాత్ర బాగా ఉన్న డేట్స్ కుదరకపోవడంతో చేయలేనని చెప్పిందట.. ఆ తర్వాత శ్రీలీలని తీసుకుందామంటే నితిన్‌తో ఇప్పటికే రెండు సినిమాలు చేయడంతో వద్దనుకున్నారు నిర్మాతలు. తాజాగా మళ్లీ హీరోయిన్ని వెతికే పనిలోపడ్డారు నిర్మాతలు.
- April 30, 2025
0
218
Less than a minute
Tags:
You can share this post!
administrator

