నేడు ప‌ద్మ భూష‌ణ్ అందుకోబోతున్న బాల‌కృష్ణ‌..!

నేడు ప‌ద్మ భూష‌ణ్ అందుకోబోతున్న బాల‌కృష్ణ‌..!

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డ్ ప్రకటించింది. ఇక సినీ రంగంలో బాల‌య్య‌తో పాటు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్, సీనియర్ హీరోయిన్ శోభనకు సైతం పద్మ భూషణ్ అవార్డులు ప్రకటించింది. కేంద్రం మొత్తంగా 139 మందికి ‘పద్మ’ అవార్డులు ప్రకటించ‌గా, వారిలో ఏడుగురికి పద్మ విభూషణ్‌, 19 మందికి పద్మభూషణ్‌, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు. బాలకృష్ణ, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నేడు ఢిల్లీలో పద్మభూషణ్ అవార్డును అందుకోనున్నారు. తన కుటుంబ సభ్యులు, టీడీపీ ఎంపీలు, కేంద్రమంత్రుల సమక్షంలో పద్మ అవార్డును అందుకునేందుకు బాల‌య్య ఢిల్లీ వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‍లో పద్మ అవార్డుల ప్రధానోత్సవం జరగనుండగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలయ్య పద్మభూషణ్ ని అందుకోనున్నారు.

editor

Related Articles