రీ-రిలీజ్ కాబోతున్న జ‌గ‌దేక వీరుడు అతిలోక సుందరి  చిరు సినిమా..!

రీ-రిలీజ్ కాబోతున్న జ‌గ‌దేక వీరుడు అతిలోక సుందరి  చిరు సినిమా..!

మేలో అయినా కొత్త సినిమాలతో సినీ ప్రియుల‌ని ఆనందింప‌జేస్తారా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్, పరీక్షలు రాసిన విద్యార్థులు.  మిగ‌తా ఫ్యాన్స్ సంగ‌తేమో కాని మెగా ఫ్యాన్స్‌కి మాత్రం మే నెల రెట్టింపు ఆనందం క‌లిగించ‌నుంది. ముందుగా హీరో చిరంజీవి త‌న ఐకానిక్ సినిమా జ‌గ‌దేక వీరుడు అతిలోక సుందరి సినిమాతో అల‌రించ‌బోతున్నాడు. మే 9న ఈ సినిమా టూడీ, త్రీడీ ఫార్మాట్స్‌లో విడుద‌ల కానుంది. ఈ సినిమా 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా రీరిలీజ్ జ‌రుపుకుంటుంది. చిరంజీవి, శ్రీదేవిల నటన, కె.రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభ, ఇళయరాజా సంగీతం, నిర్మాత అశ్వనీదత్‌ భారీ నిర్మాణ విలువలు ఈ త‌రం ప్రేక్ష‌కుల‌ని కూడా ఎంతో మెస్మ‌రైజ్ చేస్తాయి. ఇక మే 9నే మెగా ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేసే మ‌రో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ రోజు లండ‌న్ లోని మేడ‌మ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చ‌ర‌ణ్ మైన‌పు విగ్ర‌హం కూడా లాంచ్ కానుంది. ఈ కార్య‌క్ర‌మానికి రామ్ చ‌ర‌ణ్‌తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులు హాజ‌రు కానున్నారు. ఇది మెగా ఫ్యాన్స్‌కి చాలా మెమర‌బుల్ మూమెంట్ అని చెప్ప‌వ‌చ్చు. మేడమ్ టుస్సాడ్స్‌లో విగ్ర‌హం పెట్ట‌డం అనేది ఆషామాషీ కాదు. కొంద‌రు సినీ సెల‌బ్రిటీల‌కే ఆ అవ‌కాశం ద‌క్కింది. ఇప్పుడు ఆ లిస్ట్ లో రామ్ చ‌ర‌ణ్ కూడా చేర‌డంతో ఫ్యాన్స్ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

editor

Related Articles