నేచురల్ స్టార్ హీరో నాని ఇప్పుడు నటుడిగాను, నిర్మాతగాను సత్తా చాటుతున్నాడు. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. త్వరలో హిట్ 3 అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించనున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం నిర్వహించారు. వేడుకకి రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రెగ్యులర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు భిన్నంగా… వెరైటీగా ఈ ఫంక్షన్ జరిగింది. ఈ ఈవెంట్‌లో నాని మాట్లాడుతూ ఈ సినిమా కోసం అందరం కష్టపడి పనిచేశం. మంచి హిట్ కొట్టబోతున్నామనే నమ్మకం అందరిలో ఉంది. కళ్యాణ్ గారి స్టైల్‌లో చెప్పాలంటే మనల్ని ఎవడ్రా ఆపేది అని నాని డైలాగ్ పేల్చాడు. దీంతో ఆడిటోరియం ఒక్కసారిగా దద్దరిల్లింది. నాని నోటి నుండి పవన్ కళ్యాణ్ డైలాగ్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయిపోయారు.
- April 28, 2025
0
74
Less than a minute
Tags:
You can share this post!
editor

