ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన “అడాల్‌సెన్స్” అనే బ్రిటీష్ వెబ్ సిరీస్‌పై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్‌పై బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్‌తో పాటు అలియా భట్ ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ సిరీస్ చూసిన బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ బాలీవుడ్‌ను ఉద్దేశించి ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఇలాంటి ప్రయోగాత్మక వెబ్ సిరీస్‌లను బాలీవుడ్ తీయడం మానేసిందని తెలిపాడు. ‘అడాల్‌సెన్స్’ స్టోరీ చాలా అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ‘అడాల్‌సెన్స్’లో సోషల్ మీడియా వాడకం వల్ల కలిగే నష్టాలను చాలా చక్కగా చూపించారు. ఈ సిరీస్‌లోని నాలుగు ఎపిసోడ్‌లను ఒక్క షాట్‌లో చిత్రీకరించడం విశేషం. బాలీవుడ్ పూర్తిగా కొత్తదనానికి దూరమైంది. పాత సినిమాల్లోని కథలనే కొద్దిగా మార్చి మళ్లీ తీస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ సినిమా విడుదలైనప్పుడు చాలామంది విమర్శించారు. కానీ ఇప్పుడు అందరూ అదే తరహా కథలను అనుసరిస్తున్నారు. బాలీవుడ్ వాళ్ళు ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు కానీ, కొత్త ట్రెండ్‌ను సృష్టించలేకపోతున్నారంటూ ఇమ్రాన్ చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్ 13 ఏళ్ల బాలుడు జమీ చుట్టూ తిరుగుతుంది. కేటీ అనే బాలిక స్కూల్ పరిసరాల్లో దారుణ హత్యకు గురవడంతో.. ఈ నేరం కింద జమీని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అనంతరం అతడు హత్య చేయడానికి గల కారణాన్ని విచారిస్తారు పోలీసులు. అయితే ఈ విచారణలో జమీ హత్య చేశాడా.. అసలు ఎందుకు హత్య చేశాడు.. దానికి గల కారణం ఏంటి. ఈ హత్య అతని జీవితాన్ని, అతని చుట్టూ ఉన్నవారి జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనేది ఈ కథలోని ముఖ్యాంశం.
											- April 26, 2025
 
				
										 0
															 93  
															  Less than a minute 
										
				
			
				Tags:			
		You can share this post!
editor
				
