బెల్లంకొండ శ్రీను నెక్స్ట్ ఫస్ట్ లుక్ ఆరోజున ఫిక్స్!

బెల్లంకొండ శ్రీను నెక్స్ట్ ఫస్ట్ లుక్ ఆరోజున ఫిక్స్!

మన టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాల్లో భైరవం ఇంకా టైసన్ నాయుడు సినిమాలు దాదాపు పూర్తి కావచ్చాయి. ఇక ఈ సినిమాలు కాకుండా తాను యాక్ట్ చేసిన మరో సినిమా తన కెరీర్‌లో 11వ సినిమా కూడా ఉంది. దర్శకుడు కౌశిక్ పగళ్ళపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో అనుపమ పరమేశ్వరన్ మరోసారి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో మరోసారి నటిస్తోంది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్‌కి ఇప్పుడు మేకర్స్ డేట్‌ని ఫిక్స్ చేశారు. ఈ ఏప్రిల్ 27న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేస్తున్నట్టుగా డేట్ అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమాలో ఈ యంగ్ హీరో ఎలా కనిపిస్తాడో చూడాలి. ఇక ఈ సినిమా కోసం ఇద్దరు సంగీత దర్శకులు సామ్ సి ఎస్ అలాగే చైతన్ భరద్వాజ్‌లు సంగీతం సమకూరుస్తున్నారు.

editor

Related Articles