పహల్గామ్ దాడి తర్వాత ఫవాద్ ఖాన్, వాణి కపూర్ ‘అబీర్ గులాల్’ పాటలు యూట్యూబ్‌లో బ్యాన్ చేశారు. ఈ సినిమాలో ఫవాద్ ఖాన్, వాణి కపూర్ నటించారు. దాడి తర్వాత భారతదేశంలో కూడా ఈ సినిమాను బ్యాన్ చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత విస్తృతంగా బహిష్కరణ పిలుపుల మధ్య, ఫవాద్ ఖాన్, వాణి కపూర్ రాబోయే సినిమా ‘అబీర్ గులాల్’ నుండి పాటలు యూట్యూబ్ వారు రద్దు చేశారు. ‘ఖుదయా ఇష్క్’, ‘అంగ్రేజీ రంగ్రాసియా’ ట్రాక్‌లను ప్లాట్‌ఫామ్ నుండి తొలగించారు. ఈ నెల ప్రారంభంలో రొమాంటిక్ బల్లాడ్ ‘ఖుదయా ఇష్క్’, డ్యాన్స్ నంబర్ ‘అంగ్రేజీ రంగ్రాసియా’ విడుదలయ్యాయి. అయితే, ఏప్రిల్ 25న, ఎ రిచర్ లెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ కింద రెండు పాటలను సినిమా అధికారిక యూట్యూబ్ ఛానెల్ నుండి బ్యాన్ కాబడ్డాయి. అలాగే వాటిని సారెగామా అధికారిక యూట్యూబ్ ఛానెల్ నుండి కూడా తొలగించారు. ఇది ఈ సినిమాకి పెద్ద దెబ్బే అని చెప్పాలి.
- April 25, 2025
0
59
Less than a minute
Tags:
You can share this post!
editor

