గోపీచంద్ కొత్త సినిమా గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రీవేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా కుమార్ సాయి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గతంలో ఇదే బ్యానర్‌లో గోపీచంద్ ‘సాహసం’ అనే సక్సెస్‌ఫుల్ సినిమాలో నటించారు. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కించనున్న ఈ సినిమా ద్వారా మలయాళీ నటి మీనాక్షి దినేష్ తెలుగులో హీరోయిన్‌గా కొత్తగా తన కెరియర్‌ని ప్రారంభిస్తోందని, భారీ వ్యయంతో నిర్మించబోతున్నామని, త్వరలో షూటింగ్ ప్రారంభిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ: శామ్‌దత్ ఐఎస్‌సీ, సమర్పణ: బాపినీడు, దర్శకత్వం: కుమార్ సాయి.
- April 25, 2025
0
62
Less than a minute
Tags:
You can share this post!
editor

