చిరంజీవి సినిమాలో కార్తికేయ విలన్‌గా..?

చిరంజీవి సినిమాలో కార్తికేయ విలన్‌గా..?

టాలీవుడ్‌లో ఇప్పుడు అందరి చూపులు హీరో చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరో చిరంజీవిని ఢీకొనే విలన్ పాత్రను పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశాడట అనిల్ రావిపూడి. దీంతో ఈ పాత్రలో నటించేందుకు హీరో కార్తీకేయ అయితే బాగుంటుందని సినిమా యూనిట్ భావిస్తోందట. గతంలోనూ ఒకటి రెండు సినిమాల్లో విలన్‌గా తన సత్తా చాటాడు ఈ హీరో. దీంతో ఇప్పుడు ఈ హీరోకు చిరంజీవితో నటించే ఛాన్స్ దక్కే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సినిమా వర్గాల టాక్. ఇక ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తుండగా, సాహు గారపాటి ప్రొడ్యూస్ చేయనున్నారు.

editor

Related Articles