జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాంలో జరిగిన భీకర ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మంగళవారం, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ దాడిని సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై బాలీవుడ్ దిగ్గజ లిరిక్ రైటర్ జావేద్ అక్తర్ స్పందించారు. పహల్గాం ఉగ్రదాడి వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. నా హృదయం బాధతో నిండిపోయింది. ఏది ఏమైనా, ఎంత ఖర్చయినా, ఎలాంటి పరిణామాలు ఎదురైనా సరే, పహల్గాం ఉగ్రవాదులు తప్పించుకోకూడదు, వారిని వెంటనే కాల్చి పారేయాలి. ఈ సామూహిక హంతకులు తమ మానవత్వం లేని చర్యలకు వారి ప్రాణాలతోనే మూల్యం చెల్లించక తప్పదు అంటున్న జావేద్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు.
- April 23, 2025
0
134
Less than a minute
Tags:
You can share this post!
editor


