తీవ్రవాదానికి మతం లేదు, కులం లేదు.. స్పందించిన‌ ‘విరాట‌ప‌ర్వం’ ద‌ర్శ‌కుడు

తీవ్రవాదానికి మతం లేదు, కులం లేదు.. స్పందించిన‌ ‘విరాట‌ప‌ర్వం’ ద‌ర్శ‌కుడు

జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాంలో జరిగిన భీకర ఉగ్రదాడిలో  28 మంది పర్యాటకులు ప్రాణాలు విడిచారు. మంగళవారం, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ దాడిని సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా ఈ ఘ‌ట‌న‌పై విరాట‌ప‌ర్వం ద‌ర్శ‌కుడు వేణు వుడుగుల ఎక్స్ వేదిక‌గా స్పందించారు. పహల్గాములో విహారయాత్రకు వచ్చిన వారు… తిరిగి ఇంటికి పోలేదు. ఇది కేవలం రాజకీయ సమస్య కాదు, ఇది మానవతా సంక్షోభం. ప్రశాంతంగా జీవించాలనుకున్న వారి హృదయాలను తుపాకులు ధ్వంసం చేశాయి. తీవ్రవాదానికి మతం లేదు, భౌగోళిక సరిహద్దులు లేవు. ఎక్కడ మనిషి ప్రాణం గణాంకంగా మారిపోతుందో, అక్కడ మన మౌనం కూడా నిశ్శబ్దమైన నేరంగా మారుతుంది. జాతి గౌరవం తుపాకీ ద్వారా కాదు. దయతో, మానవత్వంతో, బాధితుల పట్ల కలిగిన స్పందనతో నిలబడుతుంది. ఇది కన్నీటిని మాటలుగా, మౌనాన్ని పోరాటంగా మార్చే కాలం. అంటూ వేణు వుడుగుల తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు.

editor

Related Articles