చిరుఓదెలా ప్రాజెక్ట్ ప్రారంభం అయ్యేది అప్పుడే : నాని

చిరుఓదెలా ప్రాజెక్ట్ ప్రారంభం అయ్యేది అప్పుడే : నాని

హీరో చిరంజీవి… ‘దసరా’ ఫేం శ్రీకాంత్‌ ఓదెల కాంబోలో ఒక సినిమా రాబోతున్న విష‌యం తెలిసిందే. దీనికి నాని నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. చిరు రీ ఎంట్రీ ఇచ్చిన ద‌గ్గ‌రి నుండి స‌రైన హిట్ ప‌డ‌క‌పోవ‌డంతో చిరంజీవి ఈ సినిమాతోనైనా ఫ్యాన్స్ ఆక‌లిని తీరుస్తారా అని ఎదురుచూస్తున్నారు. చిరుఓదెల అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా సాలిడ్ అప్‌డేట్‌ను పంచుకున్నాడు నాని. నాని ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా సినిమా హిట్ 3. బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంచైజీ హిట్ నుండి వ‌స్తున్న 3వ సినిమా ఇది. ఈ సినిమాలో నాని క‌థానాయ‌కుడిగా న‌టించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండ‌గా.. మే 1న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్‌ షురూ చేశారు. ఇందులో భాగంగానే తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నానిని చిరుఓదెలా ప్రాజెక్ట్ గురించి మీడియా అడుగ‌గా.. దీనిపై స్పందించాడు నాని.. చిరుఓదెలా ప్రాజెక్ట్ ప్యార‌డైజ్ సినిమా త‌ర్వాత స్టార్ట్ అవుతుంది. ప్యార‌డైజ్ అవ్వ‌గానే ఆ ప్రాజెక్ట్ మొద‌లుపెట్టి 2027లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువస్తాం. ఈ చిత్రంలోని ప్ర‌తి అప్‌డేట్‌ని సినిమా స్టార్ట్ అయ్యాక ప్ర‌క‌టిస్తాం అంటూ నాని చెప్పుకొచ్చాడు. ఇక ప్యార‌డైజ్ కూడా త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం కాబోతుంద‌ని వెల్ల‌డించాడు.

editor

Related Articles