సింగర్ ప్రవస్తి రీసెంట్‌గా సునీత, చంద్రబోస్‌లతోపాటు కీరవాణిపై సంచలన ఆరోపణలు చేయడం మనం చూశాం. ముఖ్యంగా కీరవాణిపై కూడా పలు ఆరోపణలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. కొన్ని టీవీ ఛానెల్స్ అయితే ప్రవస్తిని పిలిచి మరీ డిబేట్స్ పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో లేడీ సింగర్ హారికా నారాయణ్ స్పందిస్తూ.. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిపై ప్రశంసలు కురిపించింది.. ఓ టీవీ ఛానెల్‌లో తన వీడియో చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కీరవాణి ఎలాంటి వారో తెలియజేసింది. హారికా నారాయణ్ తన ఇన్‌స్టాలో వీడియో పోస్ట్ చేయగా, ఇందులో తాను మాట్లాడుతూ.. నేను ప్రైవేట్ సాంగ్(వీక్షణ)ని ప్రమోట్ చేసుకుంటూ వీడియో పెట్టాను. దాన్ని టీవీలో చూపించి వ్యంగ్యంగా మాట్లాడటం అస్సలు నచ్చలేదు. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు ఎలా చూపిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది హారికా.
- April 22, 2025
0
75
Less than a minute
Tags:
You can share this post!
editor

