హృతిక్‌రోష‌న్ మాజీ భార్య‌కు ఆతిథ్యమిచ్చిన రామ్‌చ‌ర‌ణ్..

హృతిక్‌రోష‌న్ మాజీ భార్య‌కు ఆతిథ్యమిచ్చిన రామ్‌చ‌ర‌ణ్..

హృతిక్ నుండి విడిపోయిన త‌ర్వాత మాజీ భార్య సుసానే ఖాన్ హైద‌రాబాద్‌తో అనుంబంధం కొనసాగిస్తుండ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. సుసానే .. షారూఖ్ భార్య గౌరీఖాన్‌తో క‌లిసి ప‌లు వ్యాపారాల‌లో భాగ‌స్వామిగా ఉంది. ఇప్పుడు వారు త‌మ వ్యాపారాన్ని హైద‌రాబాద్‌కి విస్త‌రించాల‌ని అనుకుంటున్నారు. హైద‌రాబాద్‌లో మొట్ట‌మొద‌టి చార్ కోల్ స్టోర్‌ని సుసానే ప్రారంభించారు. ఈ స్టోర్ లాంచ్‌కి ముఖ్య అతిథిగా హీరో రామ్‌చ‌ర‌ణ్ హాజ‌ర‌య్యాడు. అంతేకాదు సుసానే, ఆమె సోద‌రుడు జాయేద్ ఖాన్‌ల‌కు త‌న ఇంట్లో ఆతిథ్యం ఇచ్చాడు. దీనికి పొంగిపోయిన సుసానే, జాయేద్ అత‌డి ప్రేమ ఆద‌రాభిమానాల‌కు ప‌ర‌వ‌శించి రామ్‌చ‌ర‌ణ్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. రియ‌ల్ సూప‌ర్ స్టార్, లెజెండ్ అంటూ చ‌ర‌ణ్‌ని ఆకాశానికి ఎత్తారు. కాగా రామ్‌చ‌ర‌ణ్ ఇటీవ‌ల ముంబై సెల‌బ్రిటీల‌తో ఎక్కువ పరిచయాలు పెంచుకోవడం మ‌నం చూస్తూనే ఉన్నాం. త‌న వ్యాపార కార్య‌క‌లాపాల‌ని ముంబైలోను విస్త‌రించ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

editor

Related Articles