టాలీవుడ్ హీరో మహేష్‌బాబుకు ఈడీ నోటీసులు జారీచేసింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలంటూ తాఖీదులిచ్చింది. సాయిసూర్య, సురానా గ్రూప్ వ్యవహారంలో మహేష్‌బాబుకు నోటీసులు జారీచేసింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్టులకు మహేష్‌బాబు ప్రచారకర్తగా ఉన్నవిషయం తెలిసిందే. ఇందుకుగాను సాయి సూర్య డెవలపర్స్ నుండి రెమ్యూనరేషన్‌గా రూ.5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఇందులో రూ.3.5 కోట్లు నగదు రూపంలో, రూ.2.5 కోట్లు ఆర్‌టీజీఎస్ ఎకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్‌ఫ్లుయెన్స్ చేశారని మహేష్‌బాబుపై ఈడీ అభియోగాలు మోపింది. సురానా గ్రూపునకు చెందిన భాగ్యనగర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ నరేంద్ర సురానా, అనుబంధ సంస్థ అయిన సాయిసూర్య డెవలపర్స్ యజమాని సతీష్‌చంద్ర గుప్తా పక్కా పథకం ప్రకారం పలువురిని మోసం చేసినట్లు ఈడీ విచారణలో గుర్తించారు. సొంతింటి కోసం ఎడ్వాన్స్‌లు ఇచ్చిన పలువుర్ని మోసం చేసినట్లు తేల్చారు. ఈ రెండు కంపెనీల ద్వారా అనధికార లేఔట్లలో ప్లాట్లు అమ్మారని, ఒకే ప్లాట్‌ను బైనంబర్ల ద్వారా పలువురికి రిజిస్ట్రేషన్లు చేశారని, సరైన అగ్రిమెంట్లు లేకుండా నగదు రూపంలో డబ్బు తీసుకున్నారని విచారణలో గుర్తించారు.
- April 22, 2025
0
75
Less than a minute
Tags:
You can share this post!
editor

