చిత్రనిర్మాత తహిరా కశ్యప్‌కు రొమ్ము క్యాన్సర్ తిరగబెట్టింది..

చిత్రనిర్మాత తహిరా కశ్యప్‌కు రొమ్ము క్యాన్సర్ తిరగబెట్టింది..

తహిరా కశ్యప్ తనకు క్యాన్సర్ ‘ఇప్పటికీ ఉంది’ అని చెబుతూ, జీవితం పట్ల తన సానుకూల దృక్పథాన్ని రెండవసారి రొమ్ము క్యాన్సర్‌తో తన పోరాటాన్ని ప్రస్తావిస్తూ ఒక పోస్ట్‌ పెట్టారు. తాను రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నానని తహిరా కశ్యప్ వెల్లడించారు. ఆమె సోషల్ మీడియా పోస్ట్‌లో రెగ్యులర్ మామోగ్రామ్‌ల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. నటికి మొదటిసారిగా 2018లో రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. రచయిత – చిత్రనిర్మాత తహిరా కశ్యప్ సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో తన క్యాన్సర్ నిర్ధారణను వెల్లడిస్తూ ఒక గమనికను షేర్ చేశారు. 42 ఏళ్ల వయసులో ఆమె ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ తిరగబెట్టడంతో చాలా బాధపడుతోంది, ఆమె మొదటిసారి దాని నుండి బయటపడ్డ ఏడు సంవత్సరాల తర్వాత, మరల జీవితం పట్ల కొంత భయం ఏర్పడింది. నటుడు ఆయుష్మాన్ ఖురానా భార్య కూడా అయిన కశ్యప్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో, రెగ్యులర్ మామోగ్రామ్‌ల గురించి అవగాహన కల్పించారు, ఆమె పునఃస్థితిని ‘రెండవ రౌండ్’ అని పిలిచారు. జీవితం పట్ల సానుకూల దృక్పథంతో రెండవసారి ఈ వ్యాధితో పోరాడబోతున్నానని తన బాధను వెళ్లగక్కారు.

editor

Related Articles