హీరో నాని ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. హీరోగా, నిర్మాతగా మంచి విజయాలు అందుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం హిట్ 3, ది ప్యారడైజ్ అనే సినిమాలు చేస్తున్నాడు. ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా ది ప్యారడైజ్- రా స్టేట్‌మెంట్ సినిమా తెరకెక్కుతుండగా, ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ గ్రిప్పింగ్ టీజర్ రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ సంపాదించి, తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిధిని రీడిఫైన్ చేసింది. మార్చి 26, 2026న ది ప్యారడైజ్ తెరపైకి రానుంది. వార్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉంటుందని అర్ధమవుతోంది. పోస్టర్‌లో తుపాకీని పట్టుకుని ఉన్న నానిని చూసి ఫ్యాన్స్ థ్రిల్ అయిపోయారు. సినిమా ఫ్యాన్స్‌కి కనుల పండుగగా ఉంటుందని ముచ్చటించుకుంటున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇంగ్లీష్, స్పానిష్ సహా 8 భాషలలో విడుదల కానుంది. ది ప్యారడైజ్ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని వార్తలు వస్తున్నాయి. మొదటి భాగం వచ్చే ఏడాది మార్చి 26న, రెండో పార్ట్ ఆ తర్వాత రిలీజ్ అవుతుందని టాక్. ఫుల్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతుంది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్, స్పానిష్ లాంటి విదేశీ భాషల్లోనూ ఒకేసారి విడుదల కానుంది. సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే కథ ఇది.

- April 3, 2025
0
43
Less than a minute
Tags:
You can share this post!
editor