నిహారికకి ఒక్క సినిమా కూడా మంచి హిట్ పడలేదు. ఇక నటిగా మంచి గుర్తింపు రావడం లేదని భావించిన నిహారిక నిర్మాతగా సినిమాలు చేయడం ప్రారంభించింది. ఈ మధ్య కమిటీ కుర్రాళ్లు అనే సినిమా చేయగా, ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా మారి సినిమాలను కూడా నిర్మించాలని నిహారిక భావిస్తోంది. అయితే నిహారిక సినీ బ్యాక్‌గ్రౌండ్ లేని వ్యక్తి అయిన జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే కుర్రాడిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ పద్దతిలో చాలా అట్టహాసంగా జరిగింది. అయితే వీరి వైవాహిక జీవితం రెండేళ్లకే ముగిసిపోయిందని చెప్పాలి. పెళ్లైన రెండు సంవత్సరాలకి విడాకులు తీసుకుని ఎవరి దారులు వారు చూసుకున్నారు. విడాకుల ప్రకటన తర్వాత వీరి విడాకులకి కారణం ఏమై ఉంటుందా అని పలువురు పలు రకాల చర్చలు జరిపారు. అయితే విడాకులు తీసుకున్న అనంతరం నిహారిక తిరిగి సినిమా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతోంది. హీరోయిన్‌గా మంచి హిట్ కొట్టాలనే కసితో ఉంది.
- March 8, 2025
0
114
Less than a minute
Tags:
You can share this post!
editor

